జూలై తొలి వారంలో ఏపీఈసెట్ నోటిఫికేషన్
Sakshi Education
అనంతపురం విద్య: ఏపీ ఈసెట్–2021 నోటిఫికేషన్ జూలై తొలి వారంలో విడుదల చేయనున్నారు.
జేఎన్‌టీయూ అనంతపురంలో ఏపీ ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సి.శశిధర్‌తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి ఏపీఈసెట్ ప్రక్రియపై గురువారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. నోటిఫికేషన్ విడుదల, పరీక్ష నిర్వహణ తేదీ, సిలబస్, కోవిడ్ పరిస్థితుల్లో రాత పరీక్ష నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా చర్చించారు. ఏపీ ఈసెట్ నిర్వహణకు సంబంధించి బడ్జెట్‌ను ఆమోదించారు. ఏపీఈసెట్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 25 Jun 2021 04:38PM