జనవరి 20 కల్లా సెట్స్ కన్వీనర్ల నియామకం!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు (సెట్స్) కన్వీనర్లను జనవరి20వ తేదీ నాటికల్లా నియమించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.
ఇప్పటికే సెట్స్ తేదీలను ఖరారు చేసి ప్రకటించిన ఉన్నత విద్యా మండలి.. కన్వీనర్ల నియామకం కోసం ముగ్గురి పేర్లను సిఫారసు చేయాలని ఆయా సెట్స్ నిర్వహణ యూనివర్సిటీలకు లేఖలు రాసింది. యూనివర్సిటీలు ఈనెల 15 నాటికల్లా తమ పరిధిలోని సెట్‌కు కన్వీనర్‌ను నియమించేందుకు ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తే అందులో ఒకరిని సెట్ కన్వీనర్‌గా ఉన్నత విద్యా మండలి ఖరారు చేయనుంది. ఆ తర్వాత సెట్ కమిటీల ఏర్పాటు, సెట్ నోటిఫికేషన్లలో ఉండాల్సిన విధివిధానాలపై కమిటీలు సమావేశమై ఖరారు చేయనున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి నెలాఖరుకల్లా సెట్స్ నోటిఫికేషన్లను సెట్ కమిటీలు జారీ చేయనున్నాయి.
Published date : 08 Jan 2020 01:11PM