జేఈఈ, నీట్ పరీక్షా కేంద్రాల పెంపు: ఎన్‌టీఏ
Sakshi Education
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో జరగనున్న జేఈఈ (మెయిన్), ఎన్‌ఈఈటీ (నీట్) పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్రకటించింది.
కరోనాను దృష్టిలో ఉంచుకొని సెంటర్లు పెంచడం, ఒక్కో గదిలో తక్కువ మంది అభ్యర్ధులను కూర్చోబెట్టడం, ప్రత్యామ్నాయ సీటింగ్ ప్లాన్, విడతలవారీగా ప్రవేశం వంటి చర్యలను తీసుకుంటామని ఏజెన్సీ తెలిపింది. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్‌కు అనుగుణంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. సెప్టెంబర్ 1-6 వరకు జేఈఈ, 13న నీట్ జరగనున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షా సెంటర్లను 570 నుంచి 660కి, నీట్ సెంటర్లను 2,546 నుంచి 3,843కు పెంచుతున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్ 2020 గెడైన్స్, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్స్, బిట్‌బ్యాంక్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
నీట్ 2020 గెడైన్స్, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్స్, బిట్‌బ్యాంక్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్స్ షిఫ్టులను 8 నుంచి 12కు పెంచుతున్నామని, దీంతో ఒక్కో షిఫ్ట్‌కు అభ్యర్ధులు 1.32 లక్షల నుంచి 85 వేలకు తగ్గుతారని వివరించింది. నీట్ పరీక్షలో ఒక్కోగదిలో అభ్యర్ధుల సంఖ్యను 24 నుంచి 12కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్లు బాగా వినిపిస్తున్నాయి. పరీక్షల వాయిదా డిమాండ్‌ను ఇటీవలే సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం పరీక్షా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ సైతం పరీక్షల వాయిదా డిమాండ్‌కు మద్దతు పలికారు.

Published date : 26 Aug 2020 01:43PM