Skip to main content

ఈసెట్ 2020 సీట్ల కేటాయింపు తొలిదశ పూర్తి

సాక్షి, హైదరాబాద్: ఈసెట్-20 సీట్ల కేటాయింపు తొలిదశ పూర్తయింది. డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు నిర్వహించే ఈసెట్ ద్వారా తొలిదశలోనే 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
24,832 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఇందులో 17,647 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరి శీలనకు హాజరయ్యారు. వీరిలో 17,529 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేశారు. ఈసెట్ ద్వా రా మొత్తం 10,418 సీట్ల భర్తీకి అవకాశం ఉండగా... మొదటి విడతలోనే ఏకంగా 86 శాతం సీట్లు భర్తీ అ య్యాయి. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 170 కాలేజీల్లో 9,388 సీట్లు ఉండగా, 8,953 సీట్లకు అభ్యర్థులు ఎంపిక కావడంతో మొదటి విడతలోనే ఏకంగా 95.36 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ స్ట్రీమ్‌లో 125 కాలేజీల్లో 1,030 సీట్లు ఉండగా, కేవలం ఏడుగురు అభ్యర్థులకు మాత్రమే సీట్లు దక్కాయి. తుది విడత కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభం కానుంది. సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చేనెల 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. అనంతరం అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు సంబంధిత ధ్రువపత్రాలను కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
Published date : 29 Sep 2020 01:07PM

Photo Stories