Skip to main content

IAS Officer Shares Funny Video : ఫెయిల్‌ అవ్వడం ఎలా ?

యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. అందుకనే చాలామంది యూపీఎ‍స్సీ పరీక్షల్లో గెలుపు కోసం ఈ పరీక్షల్లో మంచిగా ఉత్తీర్ణత సాధించిన వారి విజయగాథలను ఆదర్శంగా తీసుకుంటూ ప్రిపేర్‌ అవుతారు.
Fail
Fail

పైగా వాటికి సంబంధించిన మార్గనిర్దేశిక వీడియోలను కూడా తెగ చూస్తుంటారు. కానీ ఎప్పుడైన యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియో గురించి విన్నారా! లేదు కదా. కానీ అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

యూపీఎ‍స్సీ పరీక్షలో విజయం సాధించకూడదనుకంటే..?
అసలు విషయంలోకెళ్లితే....ఐఏఎస్ అధికారి అవాంశ్ శరణ్ యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. పైగా ఆ వీడియోలో యూపీఎ‍స్సీ పరీక్షలో విజయం సాధించకూడదనుకంటే చేయవలసిన పనుల సుదీర్ఘ జాబితా గురించి చెప్పుకొస్తారు. ఆ తర్వాత ఆయన "యూపీఎస్సీ  సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఎలా విఫలమవ్వాలి'" అనే గైడ్‌ని నిజాయితీగా ప్రయత్నించవద్దు లేకుంటే మీరు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి" అంటూ చమత్కరిస్తారు.

అయితే నెటిజన్లు కూడా..
నిజానికి ఈ వీడియో చూడంగానే ఏంటిది అనిపిస్తుంది. ఎలాంటివి చేస్తే ఫెయిలవుతాం అనేవి ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఒక చక్కని సందేశంలా ఉపయోగ పడటమే కాక తాము అలా చేస్తున్నామా అనేది కూడా ఎవరకి వారుగా వ్యక్తిగతంగా తెలుసుకునేలా ఉంటుంది. అయితే నెటిజన్లు కూడా ఈ విషయాలకు ఏకిభవిస్తూ "మేము కూడా ఇలాంటి తప్పిదాలు చేశాం. అందువల్లే విఫలమయ్యానంటూ" రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

Published date : 13 Nov 2021 06:12PM

Photo Stories