Skip to main content

గురుకుల డిగ్రీ - 2021 అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ఫస్టియర్ అడ్మిషన్లకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రవేశ పరీక్షకు ఈ నెల 5 నుంచి మార్చి 5 వరకు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తామ న్నారు. ఈ పరీక్షలో అర్హతల ఆధారంగా అడ్మిషన్లకు అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారికే అడ్మిషన్లలో అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
Published date : 05 Feb 2021 05:38PM

Photo Stories