‘గురుకుల ఐదోతరగతి ప్రవేశాల గడువు జనవరి 8 వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించి రిపోర్టింగ్ గడువును వచ్చేనెల 8వరకు పొడిగిస్తున్నట్లు గురుకుల సెట్ కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
మొదటివిడతలో సీట్లు సాధించిన విద్యార్థులు వచ్చే నెల 8వ తేదీ వరకు సంబంధిత పాఠశాలల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలు, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి రిపోర్ట్ చేయాలని సూచించారు. గడువులోగా అడ్మిషన్ తీసుకోకుంటే సీటు రద్దు అవుతుందన్నారు.
Published date : 29 Dec 2020 01:20PM