ఏప్రిల్ 3, 4 తేదీల్లో జేసీజే పోస్టులకు రాతపరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను ఏప్రిల్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్–1) డాక్టర్ డి.నాగార్జున బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
రాతపరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులతోపాటు తిరస్కరించిన అభ్యర్థుల వివరాలను హైకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు. రాతపరీక్ష నిర్వహించే తేదీలను, సమయాన్ని వైబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. రాతపరీక్ష నిర్వహించే ప్రదేశాన్ని త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
Published date : 04 Mar 2021 03:04PM