Skip to main content

ఎప్పటికప్పుడు వలంటీర్ పోస్టులు భర్తీ!

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను నిత్యం పర్యవేక్షించడం ద్వారా గాడి తప్పకుండా పటిష్టంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీతో పాటు వారి హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసింది. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా వలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయంలో ఫింగర్ ప్రింట్ (బయో మెట్రిక్) అటెండెన్స్ వేయాలని స్పష్టం చేసింది. హాజరును ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయ అధికారులు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

పర్యవేక్షణ ఇలా..

  • వలంటీర్లు వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో తప్పసరిగా ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది.
  • ఎవరైనా మూడు రోజుల పాటు వరుసగా విధులకు గైర్హాజరై నాలుగు, ఐదో రోజు కూడా విధులకు హాజరు కాకపోతే 6వ రోజున తొలగించి.. 7వ రోజున ఆ వలంటీర్ పోస్టు ఖాళీ అయినట్టు నోటిఫై చేయాలి.
  • నోటిఫై చేసిన నాటినుంచి 14 రోజుల్లోగా ఖాళీలను భర్తీ చేయాలి. వలంటీర్ పోస్టులు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెంటనే భర్తీకి సంబంధిత జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
  • ఖాళీల భర్తీకి జాయింట్ కలెక్టర్ అనుమతించగానే సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లు ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలి. పోస్టుల భర్తీకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం గ్రామ, వార్డు పరిధిలో మెజారిటీ కమ్యూనిటికీ చెందిన వ్యక్తులను రిజర్వేషన్లు పాటిస్తూ భర్తీ చేయాల్సి ఉంది.
  • దీనివల్ల వలంటీర్లు, ఆ పరిధిలోని కుటుంబాల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
Published date : 20 Aug 2020 01:59PM

Photo Stories