ఏపీసెట్– 2020 కౌన్సెలింగ్ వాయిదా
Sakshi Education
ఏయూక్యాంపస్ (విశాఖ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2020 సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించాల్సిన రెండో దశ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేశామన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అటెస్టేషన్ చేసి మెంబర్ సెక్రటరీ apsetau@gmail.com కు మే 10వ తేదీలోగా పంపాలని సూచించారు.
Published date : 26 Apr 2021 04:52PM