ఏపీపీఎస్సీగ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా!
Sakshi Education
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పరీక్షలు వాయిదా పడ్డాయి ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు జరగాల్సిన ప్రధాన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
గ్రూప్-1 శిక్షణకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ జనవరి 11 శిక్షణ ప్రారంభించింది. ఈ కారణంగా తక్కువ సమయం ఉండటంతో పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థులు కోరారు. వారి అభ్యర్థన మేరకు, పరీక్షలను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ జనవరి 27 (వచ్చే సోమవారం)న ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు.
Published date : 21 Jan 2020 02:41PM