Skip to main content

ఏపీ సెట్‌– 2021 నోటిఫికేషన్‌ విడుదల

ఏయూ క్యాంపస్‌ (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్‌– 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఏపీ సెట్‌ మెంబర్‌ సెక్రటరీ ఆచార్య కె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అక్టోబర్‌ 31న రాష్ట్ర వ్యాప్తంగా 30 సబ్జెక్టుల్లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామన్నారు. జనరల్‌ విభాగం రూ.1,200, బీసీ విభాగం రూ.1000, ఎస్సీ,ఎస్టీ, పీడబ్యూడీ విభాగం వానే రూ.700 దరఖాస్తు రుసుంగా చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఏపీసెట్‌ వెబ్‌సైట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు.

చ‌ద‌వండి: ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల నిధుల విడుదలలో సర్కారు తాత్సారం..!!

చ‌ద‌వండి: ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తు గడువు ఆగస్టు 30 వరకు పెంపు
Published date : 09 Aug 2021 01:12PM

Photo Stories