ఏపీ పీసెట్- 2020 ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆంధప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ పీసెట్ ఫలితాలను గురువారం ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, పీసెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ విడుదల చేశారు.
ప్రవేశపరీక్షలకు పురుషులు, మహిళల కేటగిరీల్లో 2,009 మంది హాజరు కాగా 1,966 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 97.86గా నమోదైంది. ఫలితాలను www.sche.ap.gov.in/pecet ద్వారా పొందొచ్చు. పీసెట్ కమిటీ త్వరలో సమావేశమై కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయిస్తుందని కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు.
Published date : 30 Oct 2020 01:21PM