ఏపీ ఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువు నవంబర్ 11 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువును నవంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎంఎం నాయక్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. 13వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు.
Published date : 10 Nov 2020 02:47PM