Skip to main content

ఏపీ ఎంసెట్ 2వ విడత కౌన్సెలింగ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2020 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది.

ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టు చేయడానికి 18 వరకు గడువు పెంచారు.

సెకండ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్ ఇదీ..

  • నోటిఫికేషన్ విడుదల: జనవరి 10
  • పాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన: జనవరి 21-23
  • వెబ్ ఆప్షన్ల నమోదు: జనవరి 21-23
  • సీట్ల కేటాయింపు:జనవరి 25
Published date : 11 Jan 2021 01:43PM

Photo Stories