Skip to main content

ఏపీ ఎడ్‌సెట్- 2020 ఫస్ట్ ర్యాంకర్లు వీరే

ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్-2020 ఫలితాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి శనివారం విశాఖపట్నంలో విడుదల చేశారు.
ఎడ్‌సెట్‌కు 15,658 మంది దరఖాస్తు చేయగా..10,363 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 10,267 మంది అర్హత సాధించగా.. 99.07 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. విభాగాల వారీగా పరిశీలిస్తే గణితంలో 99.74, భౌతిక శాస్త్రంలో 99.41, బయోలాజికల్ సెన్సైస్‌లో 99.03, సోషల్ స్టడీస్‌లో 98.37, ఇంగ్లిష్‌లో 98.83 శాతం మంది అర్హత సాధించారని చెప్పారు.

Check AP Ed.CET 2020 results here

ఫస్ట్ ర్యాంకర్లు వీరే..
గణితంలో వి.ఎం.కిరణ్మయి (తూర్పుగోదావరి), ఫిజికల్ సైన్స్ లో ఫాతిమా షిఫానా ఏఆర్ (విశాఖపట్నం), బయోలాజికల్ సైన్స్ లో సతీష్ చోడవరపు (కృష్ణా), సోషల్ స్టడీస్‌లో బొల్ల రవితేజరెడ్డి (ప్రకాశం), ఇంగ్లిష్‌లో ఎం.అమీర్ బాషా (కర్నూలు) ప్రథమ ర్యాంకులు సాధించినట్టు వీసీ వెల్లడించారు.
Published date : 26 Oct 2020 12:53PM

Photo Stories