Bala Latha: ఇది యావత్ తెలుగు విద్యార్థులపై కుట్ర.. యూట్యూబ్ చానల్ హ్యాక్
ఆమె ఏప్రిల్ 18న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... గత ఏప్రిల్ 16 తెల్లవారుజామున తన యూట్యూబ్ చానల్ హ్యాక్ అయినట్లు గుర్తించానన్నారు. తాను రెండుసార్లు సివిల్ సరీ్వసులకు ఎంపికయ్యానని, కానీ విద్యార్థులు, నిరుద్యోగులకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించానని వివరించారు. వారికి ప్రేరణ కలిగిస్తూ, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో వీడియోలు చేసి అప్‌లోడ్ చేస్తున్నానని తెలిపారు. ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు, హైదరాబాద్‌కు వచ్చి చదువుకోలేని వారికి, తెలుగులో తాను చేసిన వీడియోలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
చదవండి: Bala Latha Madam Interview : అందరి కంటే.. నాకు ఈ అబ్బాయిని చూస్తే గర్వకారణం.. ఎందుకంటే..?
తన యూట్యూబ్ చానల్‌లో ఐదు లక్షల మంది వీక్షకులున్నారని తెలిపారు. తన వీడియోలు చూసి ప్రేరణ పొందిన ఎంతోమంది ఉద్యోగాలకు ఎంపికైనట్టు చెప్పారు. మే 25న సివిల్ సర్విసెస్ పరీక్షలు, జూన్‌లో యూపీఎస్‌స్సీ పరీక్షలున్న నేపథ్యంలో.. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వేలాదిమంది ఫోన్ చేసి అడుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాక్ చేయడమే కాకుండా అందులో గేమింగ్ వీడియోలు పెడుతున్నారని, ఏదైనా తప్పుడు సమాచారం పెడితే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు విద్యార్థులు నిరాశకు గురికాకుండా వారికి ప్రేరణ, పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు ‘ఆఅఔఅ ఔఅఖీఏఅ ౖఊఊఐఇఐఅఔ’అనే కొత్త యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.