బ్రేకింగ్ న్యూస్: ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.
అత్యంత పారదర్శకంగా భర్తీకి ఏర్పాట్లు
ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్–1, గ్రూప్–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో విప్లవాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.
2021–22 జాబ్ క్యాలెండర్ ప్రకారం... భర్తీ చేయనున్న పోస్టులు
2021–22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను జూన్ 18న విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 2021–22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి.అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పటివరకు మొత్తం 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.’’ అని చెప్పారు.
వచ్చే నెల నుంచే...
ప్రభుత్వం విడుదల చేసిన 2021–22 జాబ్ క్యాలెండర్ ప్రకారం... వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీకి నిర్ణయించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు 2021, జూలై నెల నుంచే విడుదల కానున్నాయి. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
వచ్చే నెల నుంచే...
ప్రభుత్వం విడుదల చేసిన 2021–22 జాబ్ క్యాలెండర్ ప్రకారం... వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీకి నిర్ణయించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు 2021, జూలై నెల నుంచే విడుదల కానున్నాయి. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
అత్యంత పారదర్శకంగా భర్తీకి ఏర్పాట్లు
ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్–1, గ్రూప్–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో విప్లవాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.
2021–22 జాబ్ క్యాలెండర్ ప్రకారం... భర్తీ చేయనున్న పోస్టులు
కేటగిరీ | పోస్టుల సంఖ్య | నోటిఫికేషన్ |
---|---|---|
ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్లాగ్ పోస్టులు | 1233 | జూలై 2021 |
ఏపీపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 | 36 | ఆగస్టు 2021 |
పోలీసు | 450 | సెప్టెంబర్ 2021 |
డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (వైద్య శాఖ) | 451 | అక్టోబర్ 2021 |
పారామెడికల్, ఫార్మాసిస్టు, టెక్నీషియన్లు | 5251 | నవంబర్ 2021 |
నర్సులు | 441 | డిసెంబర్ 2021 |
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు | 240 | జనవరి 2022 |
వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు | 2000 | ఫిబ్రవరి 2022 |
ఇతర శాఖల పోస్టులు | 36 | మార్చి 2022 |
మొత్తం | 10143 |
Published date : 18 Jun 2021 01:43PM