Skip to main content

Bank holidays in January 2023 : జనవరిలో బ్యాంక్ సెల‌వులు ఇవే..

మీరు రాబోయే ఏడాది 2023 జనవరిలో ఏమైనా బ్యాంక్ లావాదేవీల గురించి ప్లాన్ చేస్తున్నారా? అయితే, ముఖ్య గమనిక. 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది.

ఈ క్యాలండర్‌ ఆధారంగా మీ కార్యచరను సిద్దం చేసుకుంటే మంచిది. జనవరిలో పలు నగరాల్లో పలు తేదీలలో బ్యాంకులు పనిచేయవని పేర్కొంది. ఆర్‌బీఐ కొత్త ఏడాది జనవరి నెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకు సెలవుల్ని ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ సెలవుల వివరాల్ని వెల్లడించింది. సెలవు దినాల్లో బ్యాంకుల్లో అత్యవసర పనులుంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని, లేదంటే  మరో రోజుకు వాయిదా వేసుకోవాలని తెలిపింది. 

ఇక 11 సెలవుల్లో ఆదివారాలు, సెకండ్‌ సార్టడే, ఫోర్త్‌ సార్టడేతో పాటు ఆయా రాష్ట్రాల్లో పండగలకు అనుగుణంగా బ్యాంకులు పనిచేయవు. న్యూఇయర్‌ వేడుకలు, గణతంత్ర దినోత్సవం, ఇమోయిను ఇరట్పా, గాన్-నగైలు వంటి ప్రత్యేకమైన రోజుల్లో నేషనల్‌ హాలిడేస్‌ అని ఆర్‌బీఐ పేర్కొంది.  

జనవరిలో బ్యాంక్ సెల‌వులు ఇవే..!
 
☛ జనవరి 1 : మొదటి ఆదివారం

☛ జనవరి 8 : రెండవ ఆదివారం

☛ జనవరి 14 : రెండవ శనివారం

☛ జనవరి 15 : మూడవ ఆదివారం

☛ జనవరి 22 : నాల్గవ ఆదివారం

☛ జనవరి 26 : గణతంత్ర దినోత్సవం

☛ జనవరి 28 : నాల్గవ శనివారం

☛ జనవరి 29 : ఐదవ ఆదివారం

జాతీయ, ప్రాంతీయ సెలవులు ఇలా..

➤ జనవరి 2 : న్యూఇయర్‌ వేడుకలు - ఐజ్వాల్

➤ జనవరి 3 : ఇమోయిను ఇరట్పా - ఇంఫాల్

➤ జనవరి 4 : గాన్-నగై - ఇంఫాల్

Published date : 27 Dec 2022 12:51PM

Photo Stories