‘అవినీతికి తావులేకుండా పోస్టుల భర్తీ’
Sakshi Education
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2021–22 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లోని 10,143 ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2,397 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాథమిక, ఉన్నత విద్యలో ఈ పోస్టులను అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ మీద ఆధారపడి రాత పరీక్షతో భర్తీచేయనున్నట్లు పేర్కొన్నారు. 2019 జూన్ నుంచి ఇప్పటికి విద్యాశాఖలో 5,812 ఉద్యోగాలు భర్తీచేసినట్టు తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లోని మొత్తం 1,238 బ్యాక్‌లాగ్ పోస్టుల్లో విద్యాశాఖ పరిధిలో 157 (ఎస్సీ 92 ఎస్టీ 65) ఉన్నట్లు తెలిపారు.
Published date : 19 Jun 2021 02:47PM