Skip to main content

ఆటో డ్రైవర్‌ కుమారుడు..ఐఏఎఫ్‌లో ఆఫీసర్‌గా ఎంపిక‌

విశాఖలోని ఆరిలోవ ప్రాంతం రవీంద్రనగర్‌ దరి ఎస్‌ఐజీ నగర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కుమారుడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు.
ఎస్‌ఐజీ నగర్‌కు చెందిన గుడ్ల సూరిబాబు కొన్నేళ్లుగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు గుడ్ల గోపినాథ్‌ రెడ్డి ఎంఎస్సీ, ఎంబీఏ, కుమార్తె గౌరీప్రియ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. గోపినాథ్‌ వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ (వీడీఏ)లో ఇంటర్, వీఎస్‌ కృష్ణా కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదువుకున్నారు. 2009లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాడు.

ఆ ఉద్యోగంలో ..
ఇప్పుడు ఆయనను ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. ఆ ఉద్యోగంలో గోపినాథ్‌ త్వరలో చేరనున్నట్లు అతని తల్లిదండ్రులు సూరిబాబు, చిన్నతల్లి తెలిపారు. కాగా, తమ కుమారుడు దేశ రక్షణ విభాగంలో భాగస్వామ్యం అవడం గర్వకారణంగా ఉందని గోపినాథ్‌ తల్లిదండ్రులు ‘సాక్షి’ కి తెలిపారు.
Published date : 21 Jun 2021 01:07PM

Photo Stories