Skip to main content

ఆర్జీయూకేటీ సెట్‌–2020 ఫలితాలు..సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌లో ఫలితాలు

సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆర్జీయూకేటీ సెట్‌–2020 ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్‌ విజయవాడలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్‌ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్‌ సిలబస్‌ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు 88,974 మంది దరఖాస్తు చేసుకోగ..85760 మంది పరీక్షకు హాజరయ్యారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్‌ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్‌‌స టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం తెలిసిందే.
Published date : 12 Dec 2020 11:30AM

Photo Stories