AP POLYCET 2021 hall tickets: సెప్టెంబర్ 1న పరీక్ష..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లోని రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్–2021కు సంబంధించిన హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి.
అభ్యర్థులు వీటిని బుధవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి హాల్ టికెట్ నంబర్, లేదా మొబైల్ నంబర్ నమోదు చేయడం ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, పాలిసెట్–2021 పరీక్ష సెప్టెంబర్ 1న జరగనుంది.
Published date : 25 Aug 2021 02:11PM