Skip to main content

AP CM YS Jagan: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న‌ నిర్ణ‌యాలు.. పీఆర్సీ విష‌యంలో..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు.
AP CM
AP CM YS Jagan

కోవిడ్‌ నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహహక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. రబీలో పంట ఉత్పత్తుల సేకరణపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
►పీఆర్సీ అమలు సహా, ఉద్యోగులకోసం కొన్ని ప్రకటనలు చేశాం
►కోవిడ్‌ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం
►కారుణ్య నియామకాలు చేయమని చెప్పాం. యుద్ధ ప్రాతిపదికన వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలి
►గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలి
►ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి
►జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలి
►అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలి
►ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలి
►ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదు
►జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్స్‌లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై కేటాయించాం
►ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలి
►వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలి
►స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలి. దీనివల్ల డిమాండ్‌ తెలుస్తుంది
►మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌చేయాలి
►ఉద్యోగులే కాకుండా.. స్థలాలు కోరుతున్నవారి పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలి
►డిమాండ్‌ను బట్టి.. వెంటనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది
►స్థల సేకరణకు వీలు ఉంటుంది
►సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలి
►అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి
►గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌చేయాలి
►జూన్‌ 30 నాటికి ఇది ఈ ప్రక్రియ పూర్తి కావాలి
►జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి
►మిగిలిపోయిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్‌ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి
►మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు
►వారికి అవసరమైన శిక్షణ, సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు చెప్తున్నాం
►అలాగే ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం
►ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసును పెంచాం. దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి.

►కోవిడ్‌ నివారణకు ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నాం
►మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూను, ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు
►కచ్చితంగా ఈ ఆంక్షలను అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
►ఆరోగ్యశాఖలో 39 వేలమందిని నియమిస్తున్నాం
►ఇప్పటివరకూ 27 వేలమందిని రిక్రూట్‌చేశాం
►మిగిలిన వారికి ఈనెలాఖరులోగా నియమించాలి
►డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారామెడికల్‌సిబ్బంది లేరనే మాట వినకూడదు
►మార్చి 1 నుంచి ఈవిషయంలో కలెక్టర్లను బాధ్యులుగా చేస్తాను
►అందుబాటులో ఉండడం, సమస్యలు చెప్పేవారిపట్ల సానుభూతితో ఉండడం అన్నది ప్రతి ఉద్యోగి బాధ్యత. దీనివల్ల చాలావరకు సమస్యలు తీరిపోతాయి

►జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంద్వారా పూర్తి హక్కలు వారికి లభిస్తాయి
►లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి
►డాక్యు మెంట్లు ఉన్న ఆస్తికీ, డాక్యుమెంట్లు లేని ఆస్తికీ ఉన్న తేడాను వారికి వివరించాలి

►స్పందనకోసం కొత్తగా మనం ఆధునీకరించిన పోర్టల్‌ను ప్రారంభించాం
►ఒకే అంశంపై మళ్లీ అర్జీజీ వస్తే..దాని పరిష్కారంపై నిర్దిష్ట ఎస్‌ఓపీని పాటించేలా చేయాలి

►సుస్థిర ప్రగతి లక్ష్యాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
►43  సూచికలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
►ఈరంగాల్లో ప్రగతి ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకోవాలి
►దీనివల్ల మన ప్రమాణాలు మరింత పెరుగుతాయి
►దేశంలో అత్యుత్తమంగా నిలుస్తాం
►దేశంమొత్తం మనవైపు చూస్తుంది

ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలు:
►జగనన్న చేదోడు ఫిబ్రవరి 8న
►వైఎస్సార్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ  ( తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు..)–  ఫిబ్రవరి 15న 
►జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం) – ఫిబ్రవరి 22న
►మార్చి 8న విద్యా దీవెన
►మార్చి 22న వసతి దీవెన

Published date : 02 Feb 2022 06:21PM

Photo Stories