అనుమతి లేని ఇతర రాష్ట్రాల ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలపై చర్యలు
Sakshi Education
సాక్షి, అమరావతి: యూజీసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాల స్టేట్ వర్సిటీలు, ప్రైవేటు వర్సి టీలు, డీమ్డ్ వర్సిటీలు ఏపీలో తమ కోర్సులు నిర్వహించడానికి వీల్లేదని.. అలాంటి సంస్థలపై చట్ట, న్యాయపరమైన చర్యలు తీసుకుంటా మని రాష్ట్ర ఉన్నత విద్యామండలి హెచ్చరించింది.
ఆయా సంస్థల్లో తమ పిల్లలను చదివిస్తున్న, చదివించాలని భావించే తల్లిదండ్రులు.. ఆ సంస్థలకు ఉన్న గుర్తింపుతోపాటు అనుమతులు వంటి ఇతర అంశాలపై లోతుగా పరిశీలన చేయాలని సూచించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్య దర్శి బి. సుధీర్‌ప్రేమ్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు.
Published date : 28 Nov 2020 12:47PM