అక్టోబర్ 19 నుంచి టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్ల శిక్షణ!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల ఏడాది కల నెరవేరనుంది.
వీరికి శిక్షణ తేదీని ఖరారు చేస్తూ ఎట్టకేలకు టీఎస్‌ఎస్‌పీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అక్టోబర్ 19 నుంచి శిక్షణ మొదలుకావచ్చని, అవస రమైన అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని 2వ, 3వ, 5వ, 6వ, 17వ బెటాలియన్ కమాండెంట్లకు టీఎస్‌ఎస్‌పీ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 17నే 12వేల మందికిపైగా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ మొదలైనా.. గ్రౌండ్లులేని కారణంగా దాదాపు 4,200 మందికి పైగా టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు మాత్రం శిక్షణ ప్రారంభం కాలేదు. దీంతో తమకు వెంటనే శిక్షణ ప్రారంభించాలని అభ్యర్థులు పలు సార్లు కోరారు. ఈ నెల 19న వందలాది మంది అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు అక్టోబర్ 5న శిక్షణ ముగియనుంది. ఆ తరువాత వెంటనే టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభిస్తామని అధికారులు మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే, తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలో అభ్యర్థుల ముట్టడితో స్పందించిన ఉన్నతాధికారులు శిక్షణ కార్యక్రమాలను వేగిరం చేశారు.
Published date : 24 Aug 2020 01:55PM