ఆగస్టు 25న తెలంగాణ ఎంసెట్– 2021 ఫలితాలు.. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 25న ఎంసెట్–21 ఫలితాలు వెలువడనున్నాయి.
దీంతోపాటు కౌన్సెలింగ్ ముహూర్తం కూడా ఖరారైంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమై వచ్చే నెల 20న ముగియనుంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో జరిగిన ఎంసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు హాజరయ్యారు. ప్రవేశాల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే జరపాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచనున్నట్లు అడ్మిషన్ కమిటీ స్పష్టం చేసింది. మరోవైపు ఎంసెట్ పరీక్షకు 26,270 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాతంగా అగ్రికల్చర్ ఎంసెట్.. 90 శాతంపైగా హాజరు
చదవండి: జాతీయ స్థాయిలో కాలేజీలు, సీట్లు, చేరికలు ఏటా తగ్గుముఖం.. ఏపీలో మాత్రం ఇలా..
చదవండి: ఏపీలో గిరిజన వర్సిటీ స్థాపనకు చర్యలు: ధర్మేంద్ర ప్రదాన్
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..
చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాతంగా అగ్రికల్చర్ ఎంసెట్.. 90 శాతంపైగా హాజరు
చదవండి: జాతీయ స్థాయిలో కాలేజీలు, సీట్లు, చేరికలు ఏటా తగ్గుముఖం.. ఏపీలో మాత్రం ఇలా..
చదవండి: ఏపీలో గిరిజన వర్సిటీ స్థాపనకు చర్యలు: ధర్మేంద్ర ప్రదాన్
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..
- ప్రాథమిక వివరాల నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్‌లైన్ సెంటర్ల ఎంపిక, వెరిఫికేషన్: 30–08–2021 నుంచి 09–09–2021 వరకు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్: 04–09–2021 నుంచి 11–09–2021 వరకు
- ఆప్షన్ల ఎంపిక: 04–09–2021 నుంచి 13–09–2021 వరకు
- ఆప్షన్ల ఫ్రీజింగ్: 13–09–2021
- ప్రొవిజినల్ సీట్ల కేటాయింపు: 15–09–2021
- ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: 15–09–2021 నుంచి 20–09–2021 వరకు
Published date : 11 Aug 2021 02:33PM