Skip to main content

2,503 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి అనుమతించండి

సాక్షి, హైదరాబాద్‌: సంస్థలో ఖాళీగా ఉన్న 2,503 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది.
ఈ మేరకు సంస్థ యాజమాన్యం ఇటీవల రాష్ట్ర ఇంధన శాఖకు లేఖ రాసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్టు సంస్థ ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ ఆమోదించిన వెంటనే ఈ పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఐటీఐ (ఎలక్ట్రికల్‌) చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
Published date : 05 Jun 2021 01:59PM

Photo Stories