Students Career: విద్యార్థులు భవిష్యత్ బిల్డింగ్ బ్లాక్‌లు
సాక్షి ఎడ్యుకేషన్: దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని విశాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, కోస్ట్‌గార్డ్ రిఫిట్, ప్రిడక్షన్ సూపరింటెండెంట్ వినోద్‌కుమర్ పర్మార్ అన్నారు. ఈ మేరకు చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్, ఈఈఈ, ఐటీ, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఇంజినీరింగ్ కెరియర్–అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు భవిష్యత్ బిల్డింగ్ బ్లాక్‌లు అని చెప్పారు.
RBI Notification 2023: డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు.. ప్రాక్టీస్‌తోనే సక్సెస్
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో సాంకేతిక అధికారుల పాత్ర, నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. విశాఖ తూర్పుతీరం చీఫ్ స్టాఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఎం.కె.పధి మాట్లాడుతూ ఇండియన్ కోస్ట్‌గార్డ్ చరిత్ర, దాని విధులు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, ప్రయోజనాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.రమేష్, వైస్‌ప్రిన్సిపాల్ వైఎంసీ శేఖర్, డీన్‌లు సునీల్‌ప్రకాశ్, ఎస్.మోహన్‌కుమార్, టీపీవో ఎంవీవీ భాను, కో ఆర్డినేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.