Students Debarred in Degree Exams: డిగ్రీ పరీక్షల్లో 26 మంది డీబార్
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి లో సోమవారం వివిధ సెంటర్లలో నిర్వహించిన దూరవిద్య (ఎస్‌డీఎల్‌సీఈ) డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం ఫస్టియర్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ 26మంది విద్యార్థులు స్క్వా డ్‌కు పట్టుబడ్డారు.
వారిని డీబార్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎ.నరేందర్ తెలిపారు.
వరంగల్ ఏఎస్‌ఎం కళాశాలలో 12 మంది,ఎల్‌బీ కళాశాలలో ఇద్దరు,జనగామ ఏబీబీ ప్రభు త్వ డిగ్రీ కాలేజీలో 9 మంది, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగ్గురు డీబార్ అయినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 3,617 మంది విద్యార్థులకు 2,325 మంది హాజరయ్యారని తెలిపారు.
Published date : 23 Aug 2023 01:23PM