NTPC: విద్యార్థులకు ఎన్టీపీసీ ద్వారా ఉచిత శిక్షణ
సాక్షి ఎడ్యుకేషన్: యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎన్టీపీసీ రామగుండం సంస్థ ముందుకు సాగుతోందని ప్రాజెక్టు చీఫ్ జనరల్ మేనేజర్ కేదార్ రంజన్ పాండు అన్నారు. సీఎస్సార్ సీడీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో జరిగిన మెషిన్ ఆపరేటర్ అసిస్టెంట్–ఇంజెక్షన్ మౌల్డింగ్ అండ్ బ్లో మౌడ్లింగ్‌లో ఆరు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణపత్రాలు అందించారు. సంస్థ విద్యుత్ ఉత్పత్తితోపాటు ప్రభావిత, పునరావాస గ్రామాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించడంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. అర్హులైన యువతకు తగిన ఉపాధి అందించే క్రమంలో శిక్షణ కోసం అవసరమైన సహాయం అందజేస్తుందని అన్నారు. ఏజీఎం(హెచ్‌వోహెచ్‌ఆర్) బి.జయ్‌కుమార్ సిక్దర్, సీపెట్ అధికారులు, శిక్షక్షులు పాల్గొన్నారు.