Aadudam Andhra: 7లోపు దరఖాస్తు చేసుకోండి
Sakshi Education
చిత్తూరు కలెక్టరేట్ : ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల నిర్వహణ లోగో, మస్కట్ ఎంపిక పోటీలకు ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ బాలాజీ తెలిపారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు అక్టోబర్ 2వ తేదీన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయన్నారు.
ఈ పోటీల నిర్వహణలో లోగో, మస్కట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు www.sports.ap. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఎంపిక పోటీల్లో పాల్గొన్న తర్వాత లోగో, మస్కట్‌లు ఎంపికై తే సంబంధిత విజేతలకు మొదటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు అందజేస్తారని చెప్పారు.
Published date : 02 Aug 2023 04:00PM