JNTUA: జేఎన్‌టీయూ స్నాతకోత్సవం ఎప్పుడంటే..
Sakshi Education
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – అనంతపురం (జేఎన్‌టీయూఏ), 13వ స్నాతకోత్సవం 2024 జనవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు.
స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అనుమతి లభించడంతో అధికారులు నవంబర్ 29న (బుధవారం) నోటిఫికేషన్ విడుదల చేశారు.
2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో బీటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు స్నాతకోత్సవ పట్టాకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ.2 వేలు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక హార్డ్ కాపీలు యూనివర్సిటీకి పంపాల్సిన అవసరం లేదు. www.jntua.ac.inలో పరీక్షల విభాగం కింద పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Free Coaching for Group Exams: గ్రూప్ 1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ
Published date : 30 Nov 2023 01:44PM