Admission in ITI: ఐటీఐలో ప్రవేశానికి గడువు పొడిగింపు
మంచిర్యాలఅర్బన్: ఐటీఐలో ప్రవేశానికి గడువు పొడిగించినట్లు మంచిర్యాల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ చందర్ తెలిపారు. ఈ నెల 19 నుంచి 30 వరకు మూడో దఫా ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పదోతరగతి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుందన్నారు. జిల్లాలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటర్ మెకానిక్, డీజిల్ మెకానిక్, డ్రాప్ట్ మాన్ సివిల్, కోప( కంప్యూటర్ కోర్సు) డ్రెస్ మేకింగ్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు htpp://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
చదవండి: APPSC Group 1&2 Coaching: 20న గ్రూప్–1, 2 కోచింగ్ ఎంపికకు ప్రవేశపరీక్ష