Skip to main content

Internship: విద్యార్థులు ఆసక్తి బట్టి ఇంటర్న్‌షిప్‌

internship in dr br ambedkar university

ఎచ్చెర్ల క్యాంపస్‌: రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. డిగ్రీలో ఆరు సెమిస్టర్లు పరీక్షలు రాయటం, విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయడమే కాకుండా ఇంటర్న్‌షిప్‌ కూడా అమలు చేస్తున్నారు. గత ఏడాది నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. ఐదో సెమిస్టర్‌లో పూర్తిగా ఇంటర్న్‌షిప్‌ అమలు చేశారు. ఇప్పుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న నాలుగో సెమిస్టర్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అమలు చేస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఇంటర్న్‌షిప్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. నాలుగో సెమిస్టర్‌లో 6352 మంది విద్యా ర్థులు ఉండగా, 33 ప్రభుత్వ శాఖల్లో ఇంటర్న్‌షిప్‌ కల్పించారు. ప్రభుత్వ శాఖల్లో కేటాయింపులు కలెక్టర్‌ ఆదేశాల మేరకు చేశారు. మూడేళ్ల డిగ్రీలో 300 రోజులు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు నిర్వహిస్తారు. రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్‌లో ఈ ఇంటర్న్‌షిప్‌ కొనసాగిస్తారు. విద్యార్థుల పరిశీలన, ప్రజెంటేషన్‌ నివేదిక, విశ్లేషణలు ప్రతిభ ఆధారంగా 300 మార్కులు, 16 క్రెడిట్లకు మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో వారు ఆ విభాగంలో నిర్దేశించిన రోజులు పనిచేస్తారు.

ఆసక్తి, సామర్థ్యాన్ని బట్టి..
విద్యార్థులు ఆసక్తి, ప్రభుత్వ ఽశాఖలు సామర్థ్యం బట్టి ఇంటర్న్‌షిప్‌ శాఖలు కేటాయించారు. వ్యవసాయ శాఖలో 285 మంది, విద్యా విభాగంలో 2206, అటవీ శాఖలో 152, వైద్య ఆరోగ్య శాఖలో 556, గ్రామ వార్డు సచివాలయాల్లో 2433, పోలీస్‌ శాఖలో 172, అగ్ని మాపక శాఖలో 71, మత్స్యశాఖలో 85, పశుసంవర్ధక శాఖలో 7, ఏపీఎస్‌ఆర్టీసీలో 20, కెమికల్‌లో 11, పౌరసరఫరాల శాఖలో ఒకరు, కలెక్టరేట్‌లో 57, వాణిజ్య పన్నుల శాఖలో 8, దేవదాయ శాఖలో ఒకరు, చేనేత, జౌళిశాఖలో 15, ఉద్యానవన శాఖలో 34, నీటిపారుదల శాఖలో 7, ఐటీడీఏ ఒకరు, గనుల శాఖలో ఒకరు, మున్సిపాలిటీలో 14, పంచాయతీ రాజ్‌లో 4, ఫార్మాలో 42, ఆర్‌అండ్‌బీలో 10, రిజిస్ట్రేషన్‌ శాఖలో 9, రెవెన్యూ శాఖలో 57, సోషల్‌ వెల్ఫేర్‌లో 20, ఆదాయ పన్నుల శాఖలో 21, ట్రాఫిక్‌లో 6, ట్రెజరీలో 7, వెలుగులో ఒకరు, మహిళా సంక్షేమ శాఖలో 18, జిల్లా పరిషత్‌లో 20 మందికి కేటాయింపులు చేశారు. ఈ శాఖల్లో సెప్టెంబర్‌ 30 వరకు పనిచేయాల్సి ఉంటుంది.

చదవండి: Vice Chancellor: ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా విద్యలో మార్పులు అనివార్యం

పక్కాగా అమలు
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో పక్కా గా ఇంటర్న్‌షిప్‌ నిర్వహిస్తున్నాం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో అన్ని శాఖల్లో విద్యార్థులకు కేటాయింపులు జరిగాయి. విద్యార్థులకు అలాట్‌మెంట్‌ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నాం. గత విద్యా సంవత్సరం ఐదో సెమిస్టర్‌లో విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు.
– ప్రొఫెసర్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌, రిజస్ట్రార్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం.

రాష్ట్రంలో ఆదర్శంగా అమలు
గత విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఐదో సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌ అమలు చేశాం. జిల్లా అధికారుల సహకారంతో రాష్ట్రంలో ఆదర్శంగా అమలు జరిగింది. గత కంటే మెరుగ్గా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు, వైస్‌ చాన్స్‌లర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం.

Published date : 19 Aug 2023 05:24PM

Photo Stories