Inter University Competitions: నన్నయ యూనివర్సిటీలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు..
సాక్షి ఎడ్యుకేషన్: సౌత్ అండ్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్ షిప్ 2023– 24 పోటీలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ వేదిక కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీలు శనివారం ప్రారంభం కానున్నాయని వీసీ ఆచార్య కె.పద్మరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, గోవా రాష్ట్రాల్లోని 90 యూనివర్సిటీల నుంచి పురుషుల జట్లు, 80 యూనివర్సిటీల నుంచి మహిళల జట్లు పాల్గొంటాయన్నారు. యూనివర్సిటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీల ప్రారంభోత్సవానికి టూరిజం, సాంస్కృతిక, యువజన, క్రీడా శాఖల మంత్రి ఆర్‌కే రోజా, సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ వైస్ చైర్మన్ పి.ధాన్యచంద్ర తదితరులు హాజరవుతారన్నారు.