Skip to main content

BTech courses: బీటెక్‌ కోర్సుల్లో మార్పులు

Internet-based Meeting ,BTech courses, Discussion on R23 Regulations for BTech Course Changes
BTech courses

పులివెందుల రూరల్‌ : పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో గురువారం ఇంటర్నెట్‌ ద్వారా బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిఽథిగాహాజరైన అనంతపురం జేఎన్టీయూ వైస్‌ చాన్సలర్‌ రంగజనార్ధన్‌ మాట్లాడుతూ ఆర్‌23 రెగ్యులేషన్స్‌ గురించి బీటెక్‌ కోర్సులో మార్పులు చేసేవిధంగా చర్చించినట్లు చెప్పారు. రెగ్యులేషన్స్‌లో మైనస్‌ డిగ్రీ, హానర్స్‌ డిగ్రీలను రెగ్యులర్‌ డిగ్రీతో పాటు ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ సిలబస్‌లలో 5 ప్రొఫెషనల్‌ ఎలక్ట్రీవ్స్‌ను, 4 ఓపెన్‌ ఎలక్ట్రీవ్స్‌ను, 5 స్కిల్‌ ఓరియంటెడ్‌ కోర్సులను, క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పాలసీని ప్రవేశపెడుతున్నామన్నారు.

రెండు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లను రెండోసంవత్సరం, మూడోసంవత్సరం చివరిలో చేయాలని.. వీటికి 8 వారాల వ్యవధిని ఇస్తున్నామన్నారు. 4వ సంవత్సరం రెండో సెమిస్టర్‌ ప్రాజెక్టు ఇంటర్‌షిప్‌ను సెమిస్టర్‌ మొత్తం ప్రవేశపెడుతున్నామన్నారు. వీటితో పాటు ఆడిట్‌ కోర్సులను పూర్తి చేయాలని తెలిపారు. ప్రిన్సిపల్‌ వసుంధర, వైస్‌ ప్రిన్సిపల్‌ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Published date : 25 Sep 2023 09:36AM

Photo Stories