Skip to main content

AP TS Inter exams Important news: ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్య గమనిక

Preparations in full swing for the upcoming inter-public examinations  AP TS Inter exams Important news  Additional Collector Pinkesh Kumar overseeing arrangements for upcoming exams
AP TS Inter exams Important news

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) పింకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 9,141(ఫస్టియర్‌ 4,360, సెకండియర్‌ 4,781) మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు 18 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన వసతులు కల్పించాలన్నారు.

ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు నిత్యం ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు దఫాల్లో ఉంటాయని పేర్కొన్నారు. రెండవ శనివారం, అదివారం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. సమావేశంలో డీఐఈఓ శ్రీనివాస్‌, డీఈఓ రాము, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రమౌళి, ఆర్టీసీ మేనేజర్‌ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

Published date : 26 Jan 2024 11:59AM

Photo Stories