AP Engineering Colleges Fee structure 2023-24 : ఇంజనీరింగ్ కాలేజీల కనీస ఫీజు ఇలా.. ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు ఇవే..
ఇంతకు మించి ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు ఈ ఫీజుకు అదనంగా మరో 10% ఫీజును వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తాము నిర్ణయించిన ఈ కనీస ఫీజును నోటిఫై చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిషన్ ఫీజు ఖరారు చేసే వరకు తాత్కాలికంగా ఈ కనీస ఫీజు అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాక ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసే ఫీజులు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. పైన చెప్పిన ప్రక్రియను పూర్తి చేసిన తరువాత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు పెట్టుకోవచ్చని తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆగస్టు 2వ తేదీన (బుధవారం) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2020–23 సంవత్సరాలకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం 2022లో హైకోర్టులో పిటిషన్లు వేసింది.
AP EAPCET 2023 Counselling: విద్యార్థులు ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి? ఏ కళాశాలలో చదివితే మంచిది?
ఈ వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు, కనీస ఫీజును రూ.42,500గా నిర్ణయిస్తామని, దీనిపై అభిప్రాయం చెప్పాలని ఇంజనీరింగ్ కాలేజీలను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
➤☛ AP EAPCET College Predictor (Click Here)
ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి ఆగస్టు 2వ తేదీన (బుధవారం) తెలిపారు. తొలుత ఆగస్టు 3వ తేదీ నుంచి అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించినప్పటికీ సాంకేతిక కారణాలతో దానిని ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశామన్నారు.
చదవండి: ఇంజినీరింగ్ సీట్లు.. అత్యధికంగా ఈ బ్రాంచ్ సీట్లపైనే.. అంగట్లో సరుకులా..
అదే తేదీ నుంచే క్లాసులు ప్రారంభం..
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదన్నారు. వెబ్ ఆప్షన్ల నమోదు ఆగస్టు 7న ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఆగస్టు 13వ తేదీన ఆప్షన్ల మార్పులు చేసుకోవచ్చని.. 17న సీట్లను కేటాయిస్తామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోగా కళాశాలల్లో స్వయంగా రిపోర్టు చేయాలని.. అదే తేదీ నుంచే క్లాసులు ప్రారంభమవుతాయన్నారు.
Top 20 Engineering Colleges 2023 : Andhra Pradesh | Telangana