Skip to main content

Medical Jobs Australia: ‘మన వైద్యం’కు ఆస్ట్రేలియాలో ఉపాధి

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్, పారా మెడికల్‌ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
Employment in Australia for our medicine  Medical and para-medical courses

ఫిబ్ర‌వ‌రి 26న‌ మంత్రితో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఆరోగ్యమంత్రి అంబర్‌ జెడ్స్‌ అండర్సన్‌ సహా ఉన్నతస్థాయి వైద్య బృందం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో మెడి కల్, పారామెడికల్‌ హెల్త్‌ కేర్‌ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మంత్రి దామోదరతో చర్చించారు.

చదవండి: Teddy Bear Clinic: పిల్లల్లో భయం పోగొట్టే క్లినిక్‌లు ఇప్పుడు స్కూళ్లలో..

ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ  తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ ద్వారా నర్సింగ్, పారామెడికల్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్స్‌గా శిక్షణ ఇచ్చి ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి చర్యలు తీసుకున్నామన్నారు.  

Published date : 28 Feb 2024 01:41PM

Photo Stories