Skip to main content

ఆర్బీకేల్లో 7,384పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌  

సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు విశేష సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Soon notification for filling up 7,384 posts in RBKL
Soon notification for filling up 7,384 posts in RBKL

ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీకేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్కతేల్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆర్బీకేల్లో పనిచేసేవారి సంఖ్య 21,731కి చేరుతుంది.   

Also read: IACS Recruitment 2023: ఐఏసీఎస్ లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.18,000 జీతం

 

Published date : 04 Jan 2023 11:51AM

Photo Stories