Skip to main content

Attaluri Sai Anirudh: వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ టాపర్‌ అనిరుధ్‌

కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల కీర్తి పతాకం రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడింది. ఆర్‌ఎంసీలో ఫైనల్‌ ఇయర్‌ చదివిన ఎ.సాయి అనిరుధ్‌ డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ స్థాయిలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు.
medical education mbbs students Dr Parvati   Dr. A. Sai Anirudh, top ranker at YSR Health University

రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఇదే కళాశాలకు చెందిన పార్వతి మూడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు మార్చి 3న‌ స్థానిక లెక్చర్‌ గ్యాలరీలో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచిన అనిరుధ్‌ను సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ డీఎస్‌వీఎల్‌ నరసింహం మాట్లాడుతూ అనిరుధ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. థర్డ్‌ ర్యాంకర్‌ పార్వతితో పాటు డిస్టింక్షన్‌లో నిలిచిన విద్యార్థులు శ్రీలత, రాఘవేంద్రలకు అభినందనలు తెలిపి విద్యార్థులంతా వీరి కృషిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రంగరాయ వైద్య కళాశాల 99 శాతం ఉత్తీర్ణతను సాధించడం అసామాన్య విషయమని కీర్తిస్తూ అందుకు కృషి చేసిన బోధనా సిబ్బందిని కొనియాడారు.

చదవండి: Twin Sisters Scored Top Ranks In CA Final Exam- సీఏ పరీక్షల్లో ఆల్‌ఇండియా టాప్‌ ర్యాంకులు సాధించిన అక్కాచెల్లెళ్లు

వైస్‌ ప్రిన్సిపాళ్లుగా డాక్టర్‌ విష్ణువర్థన్‌, డాక్టర్‌ దేవీమాధవిల దక్షతను అభినందించారు. అనంతరం సామాజిక వేత్త స్వర్ణభారతి ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (సీడ్స్‌) వ్యవస్థాపకుడు గోకాడ రాంబాబు ర్యాంకర్లకు మెమెంటోలు బహూకరించారు.

కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంపీఆర్‌ విఠల్‌ సహా వివిధ డిపార్టుమెంట్ల హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు, అసోసియేట్‌లు, అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

Published date : 04 Mar 2024 03:13PM

Photo Stories