Skip to main content

Student Activities: త్వరలో మహిళా వర్సిటీ కార్యకలాపాలు

Women's university activities soon
Women's university activities soon

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం (2022– 23) నుంచి తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీ కార్య కలాపాలు కొనసాగిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటిం చారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు సమకూరు స్తున్నా మని తెలిపారు. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఉస్మా నియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌కు మంత్రి సోమవారం అందజేశారు. అనంతరం ఉన్నత విద్యాధికారులతో సబిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా వర్సిటీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. యూని వర్సిటీలో అవసరాలు, నియా మకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రికి సూచించినట్లు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, కోఠి ఉమెన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యుల్లత తదితరులున్నారు.

Also read: KNRUHS: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌

టీచర్ల పదోన్నతులపై వీడని ప్రతిష్టంభన
మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్న తులపై టీచర్ల సంఘాలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం జరిపిన చర్చల్లో స్పష్టత రాలేదు. మరో మూడు రోజుల్లో చర్చలు తిరిగి కొనసాగిం చాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రధానో పాధ్యాయుల పదోన్నతుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఎంఈ వోలుగా పదోన్నతులు తమకే ఇవ్వాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్‌ చేస్తుంటే, పంచా యతీరాజ్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ ప్రాధా న్యత ఇవ్వాలని కొన్ని సంఘాలు మంత్రికి నివేదించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది ఉపాధ్యాయులుంటే, ఇందులో 90 వేల మంది స్థానిక సంస్థలకు చెందిన వారే ఉన్నారని ఉపాధ్యా య సంఘాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పదోన్నతులన్నీ ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఇవ్వడం సరికాదని ఆ సంఘాల నేతలుపేర్కొన్నారు.  

Also read: Telangana SI, Constable Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. విద్యార్హలు ఇవే.. ఎంపిక విధానం ఇలా..

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 26 Apr 2022 01:02PM

Photo Stories