Bindover: బైండోవర్, బౌండ్ డౌన్ అంటే..
Sakshi Education
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల సమయంలో సాధారణంగా పాత నేరస్తులను, రౌడీ షీటర్లను, బెల్టు దుకాణాలు నిర్వహించే వారితోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, ఎవ్వరి చర్యలౖపైనెనా అనుమానం వచ్చినా అలాంటి వ్యక్తులను పోలీసులు స్థానిక తహసీల్దార్ ఎదుట హాజరు పరుస్తారు.
చట్ట వ్యతిరేక పనులు చేయబోమని బాండ్‌పై లిఖిత పూర్వక హామీతో సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేస్తారు. ఈ ప్రక్రియను బైండోవర్ (బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్) సత్ప్రవర్తనకు హామీ అంటారు.
చదవండి: SI Jobs 2023 : ఎస్‌ఐ నియామక ప్రక్రియకు బ్రేక్.. కారణం ఇదే..
బైండోవర్ సమయంలో బాండ్‌లో రాసిచ్చిన హామీని అతిక్రమించడాన్ని బౌండ్ డౌన్ అంటారు. వ్యక్తిగతంగా హాజరై రాత పూర్వకంగా ఇచ్చిన హామీని మితిమీరడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. దీనిపై భారతీయ శిక్షాస్మృతి 107, 108, 109, 110 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు.
బైండోవర్ అయిన వ్యక్తి శిక్షను తప్పించుకునేందుకు పైకోర్టులను ఆశ్రయించవచ్చు. ఇదంతా బౌండ్ డౌన్ చేసిన వారి వివరాలతో పోలీసులు నివేదికను తయారు చేసినప్పుడే వీలవుతుంది.
Published date : 20 Nov 2023 10:27AM