YSRUHS: ‘ఎంబీబీఎస్ కోర్సు’లకు వెబ్ ఆప్షన్ల స్వీకరణ
Sakshi Education
సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులో బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీ కి రెండో విడత కౌన్సెలింగ్ లో వెబ్ ఆప్షన్ల స్వీకరణకు డా. వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్థులు https://ugmq.ntruhsadmissions.com లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 1 రాత్రి 8 గంటల నుంచి ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 3 ఉదయం 9 గంటలు ఆప్షన్ల నమోదుకు ఆఖరి గడువు. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829, 94928 18477 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
చదవండి:
Published date : 02 Dec 2022 05:29PM