Skip to main content

KNRUHS: యూజీ ఆయుష్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: యూజీ ఆయుష్‌ వైద్య విద్య సీట్ల భర్తీకి డిసెంబర్‌ 17 నుంచి 19 వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు Kaloji Narayana Rao University of Health Sciences డిసెంబర్‌ 16న ఒక ప్రకటనలో తెలిపింది.
KNRUHS
యూజీ ఆయుష్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), నేచురోపతి–యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. డిసెంబర్‌ 19 మధ్యాహ్నం 2 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

చదవండి: KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు మరో అవకాశం 

ఆలిండియా కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్‌ యూనివర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులలో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులనే విషయం గుర్తించాలని స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in చూడాలని ప్రకటనలో సూచించింది. 

చదవండి: KNRUHS: ఎంబీబీఎస్‌లోనే మూడుసార్లు ‘నెక్ట్స్‌’

Published date : 17 Dec 2022 04:13PM

Photo Stories