KNRUHS: పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నవంబర్ 5 నుంచి 6వ తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు నవంబర్ 4న హెల్త్ యూనివర్సిటీ రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు, నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
చదవండి: MBBS: యథేచ్ఛగా సీట్ల బ్లాకింగ్!
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో హాజరు కావాలని, సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని పేర్కొంది. నవంబర్ 5 ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
Published date : 05 Nov 2022 03:36PM