హాస్టళ్లలో విజిలెన్స్ విస్తృత తనిఖీలు
26 జిల్లాల్లోని 54 హాస్టళ్లలో తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అన్నమయ్య జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండే సి హాస్టళ్లు, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో ఒక్కో హాస్టల్ చొప్పున తనిఖీలు చేశారు. పలు హాస్టళ్లలో మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదని గుర్తించారు. స్టాక్ రిజిస్టర్‌లో వివరాలకు హాస్టళ్లలో ఉన్న వాటికి పొంతనలేదని వెల్లడైంది. హాస్టళ్లలో విద్యార్థులవారీగా ఉన్న నోటు పుస్తకాలు, యూనిఫారాలు, ట్రంక్ పెట్టెలు, తివాచీలు, ఇతర వస్తువులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేయనుంది.
చదవండి: