HCU: హెచ్‌సీయూలో యునెస్కో చైర్
Sakshi Education
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యునెస్కో చైర్‌ను మరోసారి పునరుద్ధరించారు.
2011లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ మీడియాపై ఇక్కడ యునెస్కో చైర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మరోసారి నాలుగు సంవత్సరాల పాటు పునరుద్ధరించారు. దీనికోసం ఒక చైర్ హోల్డర్‌ను, ఇద్దరు ఫ్యాకల్టీలను నియమించారు.
చదవండి: GATE: హెచ్‌సీయూ విద్యార్థినికి 5వ ర్యాంకు
చైర్ హోల్డర్‌గా ప్రొఫెసర్ వినోద్ పావరాల, ఫ్యాకల్టీలుగా ప్రొఫెసర్ కంచన్ కె మలిక్, ప్రొఫెసర్ వాసుకీ బెలవాడీలను నియమించారు. వీరు కమ్యూనికేషన్ విభాగంలోని పీహెచ్‌డీ విద్యార్థులకు బోధన, కమ్యూనిటీ రేడియో, పరిశోధన, డాక్యుమెంటేషన్ కోసం సేవలందిస్తారు.
Published date : 26 Jul 2023 03:43PM