GATE: హెచ్‌సీయూ విద్యార్థినికి 5వ ర్యాంకు
Sakshi Education
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని Graduate Aptitude Test in Engineering (GATE)లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది.
హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ (2020 బ్యాచ్) ఎంఏ, ఐఎంఎస్‌సీ చదివిన స్వాతి ఆలిండియా స్థాయిలో 5వ ర్యాంకు సాధించి అరుదైన ఘనత సాధించింది.
చదవండి: ఈ నైపుణ్యాలు ఉంటేనే...కొలువులు మీ సొంతం : ఐఐఎం-ఉదయ్‌పూర్ డెరైక్టర్ ప్రొఫెసర్. జనత్ షా
ఆమె గేట్ ఎక్స్‌ఎల్ (లైఫ్ సైన్సెస్) పేపర్‌లో 1000కి 957 గేట్ స్కోర్‌తో క్లియర్ చేయడం మరో విశేషం. అత్యుత్తమ ర్యాంక్ సాధించిన స్వాతిని పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు అభినందించారు.
Published date : 06 Apr 2023 12:49PM